Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Saturday, April 27, 2013

యూదా వ్రాసిన పత్రిక

1. యేసు క్రీస్తు దాసుడును, యాకోబు సహోదరుడునైన యూదా, తండ్రియైన దేవునియందు ప్రేమింపబడి, యేసు క్రీస్తు నందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయునది.
2. మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించును గాక .
3.  ప్రియులారా, మనకందరికీ కలిగెడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలెనని విశేషాసక్తి గలవాడనై ప్రయత్పపడుచుండగా, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను.
4. ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడియున్నారు. వారు భక్తిహీనులై మన దేవుని క్రుపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు, మన అద్వితీయనాధుడును ప్రభువునైన యేసు క్రీస్తును విసర్జించుచున్నారు; ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడినవారు.
5. ఈ సంగతులన్నియు మీరు ముందటనే యెరిగియున్నను, నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నదేమనగా, ప్రభువు ఐగుప్తులోనుండి ప్రజలను రక్షించినను, వారిలో నమ్మకపోయినవారిని తరువాత నాశనము చేసెను.
6. మరియు తమ ప్రధానత్వము నిలుపుకొనక, తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను, మహాదినమున జరుగు తీర్పు వరకు కటికచీకటిలో నిత్యపాశములతో ఆయన బంధించి భద్రము చేసెను.
7. ఆ  ప్రకారముగానే సొదొమ గొమొర్రాలును వాటి చుట్టుపట్లనున్న పట్టణములును వీరివలెనే వ్యభిచారము చేయుచు, పరశరీరానుసారులైనందున నిత్యాగ్నిదండన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడెను.
8. అటువలెనే వీరును కలలు కనుచు, శరీరమును అపవిత్రపరచుకొనుచు, ప్రభుత్వమును నిరాకరించుచు, మహాత్ములను దూషించుచు ఉన్నారు.
9. అయితే ప్రధాన దూతయైన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు, దూషించి  తీర్పు తీర్చ తెగింపక-ప్రభువు నిన్ను గద్దించును గాక అనెను.
10. వీరైతే తాము గ్రహింపని విషయములను గూర్చి దూషించువారై, వివేకశూన్యములగు మ్రుగములవలె వేటిని స్వాభావికముగా ఎరుగుదురో   వాటివలన తమ్మును తాము నాశనము చేసికొనుచున్నారు.
11. అయ్యో వారికీ శ్రమ. వారు కయీను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలెనని బిలాము నడిచిన తప్పుత్రోవలో ఆతురముగా పరుగెత్తిరి, కోరహు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి.
12. వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయుచు, తమమును తాము నిర్భయముగా పోషించుకొనుచు, మీ ప్రేమవిందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు.వీరు గాలిచేత ఇటు అటు కొట్టుకొనిపోవు నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలములు లేక, రెండు మారులు చచ్చి వేళ్ళతో పెళ్ళగింపబడిన చెట్లుగాను, 
13.తమ అవమానమను నురుగు వెళ్ళగ్రక్కువారై, సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను, మార్గము తప్పితిరుగు చుక్కలుగాను ఉన్నారు; వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి యున్నది. 
14. ఆదాము మొదలుకొని ఏడవవాడైన హనోకుకూడ వీరిని గూర్చి ప్రవచించి యిట్లనెను. 
15. -ఇదిగో అందరికిని  తీర్పు తీర్చుటకును, వారిలో భక్తిహీనులందరును భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు, భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటినిగూర్చియు వారిని ఒప్పించుటకును, ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. 
16. వారు తమ దురాశల చొప్పున నడుచుచు, లాభము నిమిత్తము మనుష్యులను కొనియాడుచు, సణుగువారును తమ గతిని గూర్చి నిందించువారునై యున్నారు; వారి నోరు డంబమైన మాటలు పలుకును. 
17. అయితే ప్రియులారా, అంత్యకాలము నందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులుందురని మన ప్రభువైన యేసు క్రీస్తు అపొస్తలులు పూర్వమందు మీతో చెప్పిన మాటలు జ్ఞాపకము చేసికొనుడి. 
19. అట్టి వారు ప్రకృతి సంబంధులును ఆత్మ లేనివారునైయుండి భేదములు కలుగజేయుచున్నారు. 
20. ప్రియులారా, మీరు విశ్వసించు అతిపరిశుద్ధమైనదానిమీద మిమ్మును మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు, నిత్యజీవార్థమైన మన ప్రభువగు యేసు క్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు, దేవుని ప్రేమలో నిలుచునట్లు కాచుకొని యుండుడి. 
22. సందేహపడువారి మీద కనికరము చూపుడి. 
23. అగ్నిలోనుండి  లాగినట్టు కొందరిని రక్షించుడి, శరీరసంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏ  మాత్రము నొప్పుకొనక దానిని అసహ్యించుకొనుచు భయముతో కొందరిని కనికరించుడి. 
24. తొట్రిల్లకుండ మిమ్మును కాపాడుటకును తన మహిమ యెదుట ఆనందముతో 
25. మిమ్మును నిర్దోషులనుగా నిలువబెట్టుటకును, శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా, మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములును కలుగును గాక ఆమేన్ .
            Download Audio File                     

No comments:

Post a Comment